మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుతపులి సంచారం!... ఇదిగో వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుతపులి సంచారం!... ఇదిగో వీడియో

Leopard seen near Miyapur Railway Staion
  • మెట్రో స్టేషన్ వెనుకాల భాగంలో చిరుతను గుర్తించిన స్థానికులు
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • అటవీ అధికారులతో కలిసి గాలిస్తామని పోలీసుల వెల్లడి
హైదరాబాద్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నగరంలోని మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ వెనుకాల భాగంలో కొంతమంది చిరుతపులిని చూసినట్లుగా చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులతో చిరుతను గాలిస్తామని వెల్లడించారు.

మియాపూర్ స్టేషన్ వద్ద చిరుత సంచారానికి సంబంధించి ఓ వీడియో ఎక్స్ వేదికగా వైరల్‌గా మారింది. చెట్ల పక్కన నుంచి చిరుత నడుస్తూ వెళుతుండగా ఎవరో వీడియోను తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Advertisement
Hyderabad
Leopard
Hyderabad Metro

More Telugu News