ప్రియుడ్ని ట్రంకు పెట్టెలో దాచిపెట్టిన ప్రేయ‌సి.. కుటుంబ స‌భ్యులు బెదిరించ‌డంతో చివ‌రికి షాకింగ్ దృశ్యం.. వైర‌ల్ వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడ్ని ట్రంకు పెట్టెలో దాచిపెట్టిన ప్రేయ‌సి.. కుటుంబ స‌భ్యులు బెదిరించ‌డంతో చివ‌రికి షాకింగ్ దృశ్యం.. వైర‌ల్ వీడియో!

Girlfriend Locked her Boyfriend in a Trunk Box Viral Video
  • బీహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న 
  • కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ట్రంకు పెట్టెలో ప్రియుడ్ని దాచిన యువ‌తి
  • సోద‌రుడు భ‌య‌పెట్టడంతో ట్రంకు పెట్టె తాళం తెరిచిన యువ‌తి
  • అందులోంచి యువ‌కుడు బ‌య‌ట‌కు రావ‌డంతో కుటుంబ‌మంతా షాక్‌
బీహార్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. కుటుంబ స‌భ్యుల‌కు భ‌య‌ప‌డి ఓ యువ‌తి త‌న బాయ్‌ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ట్రంకు పెట్టెలో ఉండాల్సిన‌ బ‌ట్ట‌లు, ఇత‌ర వ‌స్తువులు బ‌య‌ట చింద‌ర‌వంద‌ర‌గా ప‌డి ఉండ‌టం చూసిన కుటుంబ స‌భ్యులు అప్ప‌టివ‌ర‌కు ఇంట్లోనే ఉన్న యువ‌తిని నిల‌దీశారు. దాంతో యువ‌తి తాను ఏమీ చేయ‌లేద‌ని బుకాయించింది. కానీ, ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో త‌ల్లి, సోద‌రుడు ట్రంకు పెట్టెను తెర‌వాల్సిందిగా చెప్పారు. 

అయితే, యువ‌తి అందులో ఏం లేద‌ని, తాను తెర‌వ‌న‌ని చెప్పింది. చివ‌ర‌కు సోద‌రుడు గ‌ట్టిగా చెప్ప‌డంతో ఆమెకు పెట్టె తెర‌వ‌క త‌ప్ప‌లేదు. అలా సోద‌రి పెట్టెను ఓపెన్ చేస్తున్న‌ స‌మ‌యంలో సోద‌రుడు వీడియో తీశాడు. 

అంతే.. పెట్టె తెరుచుకున్న వెంట‌నే అందులోంచి ఓ యువ‌కుడు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అది చూసిన కుటుంబ స‌భ్యులు షాక్ అయ్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ యువ‌కుడు త‌న‌కేమీ తెలియ‌న‌ట్టుగా యువ‌తి వెనుక‌వైపున నిల‌బ‌డ‌డం వీడియోలో ఉంది. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు అంత‌చిన్న పెట్టెలో యువ‌కుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.   
Advertisement
Viral Videos
Girlfriend
Boyfriend
Trunk Box
Bihar

More Telugu News