Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త అవ‌తారంలో మెగా మేన‌ల్లుడు.. ఆస‌క్తిక‌రంగా కొత్త మూవీ ప్రీ లుక్ వీడియో!

Impressive glimpse of SDT 18 unveiled
Advertisement
  • నేడు సాయి దుర్ఘ తేజ్ బ‌ర్త్ డే
  • ఈ సంద‌ర్భంగా మెగా మేన‌ల్లుడి కొత్త సినిమా ప్రీ లుక్ వీడియో విడుద‌ల‌
  • కండ‌లు తిరిగిన దేహంతో క‌నిపించిన సాయితేజ్‌
  • రోహిత్ కేపీ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
Advertisement
సుప్రీమ్ హీరో సాయి దుర్గ‌ తేజ్ కొత్త సినిమాకు సంబంధించిన స్పెష‌ల్ వీడియో తాజాగా రిలీజ్ అయింది. ఇవాళ మెగా మేన‌ల్లుడి పుట్టినరోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ప్రీ లుక్ వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో సాయితేజ్ కండ‌లు తిరిగిన దేహంతో కొత్త అవ‌తారంలో క‌నిపించాడు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ ఈ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఎస్‌డీటీ 18 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కీరోల్‌లో న‌టిస్తోంది.

ఇక ఈ ప్రీలుక్ టీజ‌ర్‌లో గ్రాండ్ సెట్‌లు, పీరియాడిక్ ఆయుధాలు ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకున్నాయి. ఇది ప్రారంభం మాత్రమేనని, సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసే అంశాలు మునుముందు మ‌రిన్ని వ‌స్తాయ‌ని మేకర్స్ పేర్కొన్నారు. కాగా, ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, చైత‌న్య రెడ్డి నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
SDT 18
Sai Dharam Tej
Tollywood

More Telugu News