అక్టోబర్ 16న జమ్ము కశ్మీర్ సీఎంగా ప్రమాణం చేయనున్న ఒమర్ అబ్దుల్లా
- అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచిన ఎన్సీ-కాంగ్రెస్ కూటమి
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎల్జీకి కూటమి విజ్ఞప్తి
- కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన ఎల్జీ
అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు మెజార్టీకి కావాల్సిన సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌తో నేషనల్ కాన్ఫరెన్స్ జత కట్టింది. ఈ క్రమంలో శాసన సభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరాయి. దీంతో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఎల్జీ ఆహ్వానించారు.