Silk Smitha: సిల్క్ స్మిత నోట్ల కట్టలపై పడుకునేది: డిస్కో శాంతి!

Disco Shanthi Interview
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ గురించి ఆ తరం ప్రేక్షకులకు బాగా తెలుసు. అప్పట్లో ఆమె లేని స్టార్ హీరోల సినిమాలు ఉండేవి కాదు. ఆమె ప్రధాన పాత్రగా కూడా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఆమె గురించి ఇప్పటికీ చాలా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి సిల్క్ స్మిత గురించి, రీసెంటుగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ప్రస్తావించారు.

"స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ముంబైలో ఉన్న నేను షాక్ అయ్యాను. తన భర్త గురించి .. ఆ భర్తకు ఆల్రెడీ ఉన్న పిల్లలను గురించి నాతో చెబుతూ ఉండేది. నా దగ్గర ఏ విషయాలు దాచేది కాదు" అని అన్నారు. 

" అప్పట్లోనే స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. ఒక రోజుకి ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకూ తీసుకునేది. మేము ఆ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది. స్మిత నెలకి ఐదు లక్షలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లే కొనుక్కోవచ్చు గదా అనే దానిని.  నిజానికి ఆమెది చాలా విలాసవంతమైన జీవితం. మంచంపై డబ్బు పరుచుకుని పడుకునేది. "నేను వేషాల కోసం తిరిగినప్పుడు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను డబ్బులపై పడుకుంటున్నాను" అని తనే చెప్పింది. సెట్లో తనని చాలా గౌరవంగా చూసేవారు" అని చెప్పారు. 

Go Back to Shorts
Silk Smitha
Disco Shanthi
Tollywood

More Telugu News