కల్యాణ్ జ్యుయెలర్స్ యజమాని ఇంట నవరాత్రి వేడుకలకు చిరంజీవి, నాగార్జున... ఫొటోలు ఇవిగో!
- కేరళలోని త్రిసూర్ లో టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా సంబరాలు
- చిరంజీవి, నాగార్జునలకు ప్రత్యేక ఆహ్వానం
- కల్యాణ్ జ్యుయెలరీ అధినేత ఇంట సందడి చేసిన చిరు, నాగ్
కల్యాణ్ జ్యుయెలర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్ ఆహ్వానం మేరకు చిరంజీవి, నాగార్జున ప్రత్యేక విమానంలో త్రిసూర్ వెళ్లారు. ఈ వేడుకల్లో కల్యాణరామన్ తో కలిసి చిరంజీవి, నాగార్జున జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బొమ్మల కొలువును సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.





