అప్పులు చేయాలంటే ఆంధ్రుల తర్వాతే.. కేంద్రం నివేదికలో షాకింగ్ విషయాలు
- ప్రతి లక్షమందిలో 60,093 మందికి అప్పులే
- పట్టణ ప్రజలతో పోలిస్తే ఎక్కువగా అప్పులు చేస్తున్న గ్రామీణులు
- అప్పుల్లో పురుషులను దాటేసిన మహిళలు
అప్పులున్న పట్టణ మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య 21.69 శాతం అధికం. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 7.49 శాతం అధికంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ పురుషులకు మించి మహిళలకు అప్పుల్లేవు. జులై 2022 నుంచి జూన్ 2023 మధ్య ఈ సర్వే నిర్వహించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి లక్ష మందిలో 11,844 మందిపైనే అప్పులున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోనే ప్రజలపై రుణభారం ఎక్కువగా ఉన్నట్టు సర్వే వివరించింది.