రతన్ టాటాతో అనుబంధాన్ని గుర్తు చేసుకొని పీయూష్ గోయల్ కంటతడి
- కొన్నేళ్ల క్రితం రతన్ టాటా తన ఇంటికి వచ్చాడన్న పీయూష్ గోయల్
- అల్పాహారం చేస్తున్న సమయంలో దోశ, ఇడ్లీ, వడ, సాంబార్ మాత్రమే తిన్నారని వెల్లడి
- సాధారణ జీవితంతోనే సంతోషంగా ఉంటారని తెలుసుకున్నానన్న కేంద్రమంత్రి
చాలా ఏళ్ల క్రితం రతన్ టాటా తమ ఇంటికి వచ్చారని, అల్పాహారం చేస్తున్న సమయంలో ఆయన కేవలం ఒక దోశ, ఇడ్లీ, వడ, సాంబార్ మాత్రమే తీసుకున్నారని తెలిపారు. ఆయన సాధారణ జీవితంతోనే ఎంతో సంతోషంగా ఉంటారని అప్పుడే తనకు తెలిసిందన్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు తన భార్య మనసులోని భావాన్ని అర్థం చేసుకొని... మీరు నాతో ఫొటో తీసుకోవాలనుకుంటున్నారా? అని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం మధుర జ్ఞాపకం అన్నారు.