బిగ్‌బాస్ సెట్స్‌లో గాడిద.. తొలగించాలంటూ సల్మాన్‌కు ‘పెటా ఇండియా’ లేఖ
- హిందీ బిగ్‌బాస్ 18లో గాడిదను కూడా భాగం చేసిన నిర్వాహకులు
- హౌస్‌మేట్స్‌కు దాని సంరక్షణ బాధ్యతలు
- వినోదం కోసం జంతువులను వాడుకుంటారా? అని పెటా ఆగ్రహం
- దానిని తమకు అప్పగిస్తే అభయారణ్యంలో వదిలిపెడతామన్న పెటా
బిగ్‌బాస్ హౌస్‌లో గాడిదను చూసిన చాలామంది పెటా ఇండియాకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జంతు రక్షణ సంస్థ స్పందిస్తూ సల్మాన్‌ఖాన్‌కు లేఖ రాసింది. వినోదం కోసం జంతువులను వాడుకోవడం తగదని, సెట్ నుంచి దానిని తొలగించేలా నిర్వాహకులను కోరాలని అభ్యర్థించింది. దానిని తమకు అప్పగిస్తే రక్షించిన గాడిదలతోపాటు దానిని అభయారణ్యానికి తరలిస్తామని పేర్కొంది.