పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలని బీజేపీ భావిస్తోంది: సీపీఎం నేత సంచలన వ్యాఖ్యలు
- పవన్ హిందూత్వ అజెండాను ఎత్తుకున్నాడంటున్న సీపీఎం
- పవన్‌ను బీజేపీ ఆడిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శ
- చంద్రబాబును దింపేసి పవన్‌ను ఆస్థానంలో కూర్చోబెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్న నేత
ఈ తరుణంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపేసి ఆ స్థానంలో పవన్ కల్యాణ్‌ను కూర్చొబెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీని నాశనం చేసేందుకు పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో వంద రోజుల కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోందని ఆయన అన్నారు.