రఘునందన్ రావు ఫిర్యాదు... కేటీఆర్, హరీశ్ రావుపై కేసు నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రఘునందన్ రావు ఫిర్యాదు... కేటీఆర్, హరీశ్ రావుపై కేసు నమోదు

Police case filed against ktr and harish rao
  • బీఆర్ఎస్ నేతలతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఇటీవల కొండా సురేఖపై అసభ్యకర ఫొటోను పోస్ట్ చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేశారు.
Advertisement
KTR
Harish Rao
Telangana
Raghunandan Rao
CCS

More Telugu News