ఇలాగే ముందుకెళ్తే బంగ్లాదేశ్ పరిస్థితులు దాపురిస్తాయి.. రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరిక
- పేదలను హైడ్రా ఇబ్బందుల పాలు చేస్తోందన్న ఎమ్మెల్యే
- శని, ఆదివారాలు వస్తున్నాయంటే పేదలు హడలిపోతున్నారని ఆవేదన
- ఇలాగే కూల్చుకుంటూ పోతే బంగ్లాదేశ్ పరిస్థితులు తప్పవని హెచ్చరిక
కూకట్‌పల్లి సున్నం చెరువు సమీపంలోని పద్మావతి నగర్ నివాసితులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తన పర్యటన సందర్భంగా హరిజన్ బస్తీ వాసులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.