Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీలో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం.. చోద్యం చూస్తూ వీడియో తీసిన మరో ఇద్దరు!

5 year boy assaulted in Uttar Pradesh
Advertisement
  • బాలుడిని ఇంటి నుంచి తీసుకెళ్లి అఘాయిత్యం
  • బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో ప్రశ్నించిన కుటుంబ సభ్యులు
  • అడిగేందుకు వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులపై నిందితుల దాడి
  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు
Advertisement
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. మరికొందరు ఈ ఘటనను వీడియో తీశారు. హర్పూర్ ‌జిల్లాలో ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి ఆరోగ్యం క్షీణిస్తుండడం, శరీరంపై గాయాలు ఉండడంతో ఈ నెల 26న కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో జరిగిన దారుణ ఘటనను బాలుడు వివరించాడు. దీంతో కుమారుడితో కలిసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర్ష్, జునైద్ అనే వ్యక్తులు బాలుడిని ఇంటి నుంచి సమీపంలోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడున్న మేకలకాపరులు రిజర్వాన్, అల్ఫెజ్ ఈ ఘటనను వీడియో తీసి ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. విషయం గురించి తెలిసి నిందితులను ప్రశ్నించేందుకు వెళ్లిన బాలుడి కుటుంబ సభ్యులపై నిందితులు దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు.  

పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement
Uttar Pradesh
Crime News
UP Police

More Telugu News