ఎమ్మెల్యే కొలికపూడి తలపెట్టిన ‘సేవ్ తిరువూరు‘ ర్యాలీ రద్ధు
- కొలికపూడి ‘సేవ్ తిరువూరు’ ర్యాలీ విరమించుకోవాలని ఆదేశించిన టీడీపీ అధిష్ఠానం
- కొలికపూడి తీరుపై సీఎం చంద్రబాబుకు మీడియా ప్రతినిధుల ఫిర్యాదు
- ర్యాలీ విరమించుకున్నట్లు వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే కొలికపూడి
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో 'సేవ్ తిరువూరు' పేరుతో ర్యాలీకి కొలికపూడి పిలుపునిచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కొలికపూడి ర్యాలీకి బ్రేక్ పడింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తనను ర్యాలీ విరమించుకోవాలని ఆదేశించారని, దీంతో ర్యాలీ విరమించుకున్నట్లు కొలికపూడి ఆదివారం సాయంత్రం వీడియో విడుదల చేశారు.