అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్‌ను తీసుకురావడానికి రెస్క్యూ మిషన్!
- జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్
- స్టార్ లైనర్‌లో లీకేజీ కారణంగా భూమి మీదకు రాలేకపోయిన శాస్త్రవేత్తలు
- స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ-9ను పంపించి భూమి మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు
వీరిని భూమి మీదకు తీసుకు రావడం కోసం నాసా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ-9ను పంపించి భూమి మీదకు తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రూ-9 మిషన్ సెప్టెంబర్ 29 సాయంత్రం ఐదున్నర గంటలకు అంతరిక్షంలోకి వెళ్లనుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా నలుగులు వ్యోమగాములు ప్రయాణించవచ్చు.