Karti: పవన్ కు క్షమాపణల వ్యవహారం... తమిళనాడులో కార్తీకి పెరుగుతున్న మద్దతు

Seeman comes in support for Karti
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల 'సత్యం సుందరం' సినిమా ఫంక్షన్ లో యాంకర్ కు, తమిళ హీరో కార్తీ మధ్య జరిగిన లడ్డూ సంభాషణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పడం తెలిసిందే. 

అయితే, కార్తీ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో కార్తీకి మద్దతిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సినీ ప్రముఖుడు, రాజకీయనేత సీమాన్ కూడా ఈ విషయంలో స్పందించారు. సీమాన్ వ్యాఖ్యల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమిళులు ఈ వీడియోను పెద్ద ఎత్తున లైక్ చేస్తున్నారు. 

కార్తీ చేసిన వ్యాఖ్యల్లో ఏం తప్పు ఉందని ఆయనతో క్షమాపణలు చెప్పించుకున్నారని సీమాన్ నిలదీశారు. కార్తీ కొత్త సినిమా విడుదల కావాల్సి ఉండడంతో, తన సినిమాను ఎక్కడ అడ్డుకుంటారోనన్న ఆలోచనతో కార్తీ క్షమాపణలు చెప్పినట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. తాను తప్పుగా మాట్లాడానన్న ఉద్దేశంతో కార్తీ క్షమాపణలు చెప్పలేదని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూలో కూడా సనాతన ధర్మం ఉందంటారా? అని సీమాన్ ప్రశ్నించారు. 

కాగా, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా... చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏంటో అని దెప్పిపొడుస్తూ ఇప్పటికే ట్వీట్ చేయడం తెలిసిందే.
Go Back to Shorts
Karti
Laddu
Pawan Kalyan
Seeman
Tamil Nadu
Laddu Row
Andhra Pradesh

More Telugu News