'గో బ్యాక్ క్రిస్టియన్ జగన్' అంటూ అలిపిరి వద్ద స్వాముల నిరసన
- రేపు తిరుమలకు వెళ్తున్న జగన్
- జగన్ పర్యటనను అడ్డుకుంటామంటున్న స్వామీజీలు
- భార్యతో కలిసి స్వామికి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్న
అలిపిరి వద్ద శ్రీనివాసానంద స్వామీజీతో పాటు పలువురు స్వామీజీలు నిరసనకు దిగారు. 'గోబ్యాక్ క్రిస్టియన్ జగన్' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు భార్యతో కలిసి ఏనాడూ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించని జగన్... ఇప్పుడు తిరుమలకు ఎందుకు వస్తున్నారని స్వామీజీలు మండిపడ్డారు.
వైసీపీ పాలనలో ఆలయాలపై ఎన్నో దాడులు జరిగినా ఒక్క రోజు కూడా జగన్ నోరు మెదపలేదని విమర్శించారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జగన్ పర్యటన సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే... దానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.