భరణం కోసం వృద్ధుల గొడవ.. 'కలియుగం వచ్చేసిందేమో' అంటూ కోర్టు వ్యాఖ్య
- భర్త నుంచి మనోవర్తి కోరుతున్న 75 ఏళ్ల భార్య
- ఫ్యామిలీ కోర్టులో భార్యకు అనుకూలంగా తీర్పు
- హైకోర్టులో సవాల్ చేసిన 80 ఏళ్ల భర్త
ఇంతకీ కారణమేంటంటే.. మనోవర్తి కోసం హైకోర్టు దాకా వచ్చిన ఆ జంటలో భార్య వయసు 75 ఏళ్లు కాగా భర్త వయసు 80 ఏళ్లు కావడమే! అలహాబాద్ హైకోర్టు విచారణకు వచ్చిన ఈ కేసు వివరాలు..
అలీగఢ్ కు చెందిన మునేశ్ కుమార్ గుప్త (80) తన భార్య నుంచి విడాకులు పొందారు. ఈ సందర్భంగా మనోవర్తి కావాలంటూ గుప్త భార్య కోరగా.. ఫ్యామిలీ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును గుప్త అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం ఈ కేసు విచారణకు హాజరైన గుప్త, ఆయన భార్యను చూసి జస్టిస్ సౌరభ్ శ్యామ్ శంషేరి ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఇదేం గొడవ అని మందలిస్తూ.. ఇద్దరూ కూర్చుని సామరస్యపూర్వకంగా ఒప్పందానికి రావాలని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు.