Devara: రిలీజ్‌కు ముందే రికార్డులు కొల్లగొడుతున్న దేవర ఖాతాలో మరో రికార్డు

Devara Movie Creates Another Record In Overseas
షార్ట్స్‌లో చూడండి
విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతున్న ఎన్టీఆర్ దేవర మూవీ మరో ఘనత సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సినిమాగా రికార్డులకెక్కిన ఈ మూవీ తాజాగా రెండు మిలియన్ల మార్కును చేరుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రిలీజ్‌కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో అప్పటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటించగా,  స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటిస్తుండగా తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని, ఎన్టీఆర్ డబుల్ రోల్‌లోనే కనిపిస్తారని స్పష్టం చేశారు. అయితే, తండ్రీకొడుకులుగానా? అన్నదమ్ములగానా? అన్న విషయాన్ని మాత్రం తాను చెప్పలేనని పేర్కొన్నారు. కాగా, దేవర స్పెషల్ షోలకు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.
Go Back to Shorts
Devara
NTR
Janvi Kapoor
Koratala Siva
Tollywood

More Telugu News