జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సి.కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • జానీ కేసు సినిమా పరిశ్రమపై తప్పుడు సంకేతాలను సృష్టించిందన్న కల్యాణ్
  • జానీపై కేసు పెట్టిన తర్వాత కమిటీ సభ్యులు ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్న
  • ఆరోపణలు చేసిన అమ్మాయికి ఎవరైనా నిర్మాత ఆఫర్లు ఇస్తారా? అన్న కల్యాణ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ కేసు సినిమా పరిశ్రమపై తప్పుడు సంకేతాలను సృష్టించిందన్నారు. అతనిపై కేసు పెట్టిన తర్వాత లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ సభ్యులు ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీశారు.

సినిమా పరిశ్రమలో అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటూ పని చేసుకుంటూ వెళతారని, కానీ ఇప్పుడు ఇలాంటి కేసుల వల్ల, మహిళా టెక్నిషియన్లతో కలిసి పనిచేసేవారు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. 

అయినా ఎప్పుడో లైంగిక వేధింపులు జరిపితే ఇప్పుడు ఫిర్యాదు చేయడమేమిటన్నారు. ఆరోపణలు చేసిన అమ్మాయికి ఎవరైనా నిర్మాత ఆఫర్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిభ, క్రమశిక్షణ ఉన్న వారికి పరిశ్రమలో కచ్చితంగా అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్యానించారు.

C Kalyan
Johnny Master
Tollywood
Telangana

More Telugu News