శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై భారీ తగ్గింపు... వివరాలు ఇవిగో!
- శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 వాస్తవ ధర రూ.74,999లు
- ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24,250లకే
- ఈ నెల 27 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
గత జనవరిలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999లు కాగా, ఇప్పుడు రూ.59,999లకే లభిస్తుంది. బ్యాంక్ ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ.12వేలతో పాటు అప్ గ్రేడ్ బోనస్ రూ.3వేలతో ధర తగ్గుతుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.40వేల వరకూ శాంసంగ్ రాయితీ అందిస్తోంది.
ప్రస్తుతం అమెజాన్ లిస్టింగ్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ రూ.57,490లు పలుకుతోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24,250లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది.