జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
- 2019లో జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయమైనట్లు తెలిపిన పోలీసులు
- దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని వెల్లడి
- నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్న పోలీసులు
దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. 2020లో ముంబయిలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు కేవలం 16 మాత్రమే అని తెలిపారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్నారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ ఆమెను బెదిరించాడన్నారు.