ఈ వీడియో తిరుమలలో చిత్రీకరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఏపీ పోలీస్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- తిరుమలలో అపచారం అంటూ వీడియోపై ప్రచారం
- ఇది ఫేక్ వీడియో అని స్పష్టం చేసిన ఏపీ పోలీస్
ఇది విజయవాడలో జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలో చిత్రీకరించిన వీడియో అని వెల్లడించింది. ఈ వీడియోను తిరుమలలో చిత్రీకరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించింది.
దివ్యమైన తిరుమల పవిత్రతను కించపరిచేలా ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడం నేరం అని, సంబంధిత సెక్షన్ల కింద తీవ్రస్థాయిలో చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని పోలీస్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.