ఫోన్‌ నంబర్ అడిగిన లేడీ ఫ్యాన్‌.. నీరజ్‌ చోప్రా రెస్పాన్స్ ఏమిటంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోన్‌ నంబర్ అడిగిన లేడీ ఫ్యాన్‌.. నీరజ్‌ చోప్రా రెస్పాన్స్ ఏమిటంటే..!

European Fan asks Javelin Thrower Neeraj Chopra for his Phone Number
  • తన ఆట తీరుతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న నీరజ్‌ చోప్రా
  • ఆటోగ్రాఫ్ ఇస్తున్న‌ క్ర‌మంలో ఓ లేడీ ఫ్యాన్‌ ఫోన్‌ నంబర్ అడిగిన వైనం
  • ఆమె అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్  
భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌తో మెరిసిన నీర‌జ్‌.. ఈసారి ర‌జ‌తం సాధించాడు. ఇలా వ‌రుస‌గా దేశానికి రెండు ఒలింపిక్స్ మెడ‌ల్స్‌ తెచ్చి పెట్టాడు. అలాగే అత‌ను భారీ స్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక నీర‌జ్ చోప్రా క్రేజ్ భార‌త్‌కే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ అతడికి భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. వారిలో లేడీ ఫ్యాన్స్ కూడా ఉండటం విశేషం. 

తన ఆట తీరుతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న నీరజ్‌ చోప్రాను ఓ లేడీ ఫ్యాన్‌ ఫోన్‌ నంబర్ అడిగింది. అయితే అతడు స్పందించిన తీరు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యూరోపియన్ అభిమాని ఈ స్టార్ అథ్లెట్‌ని అతని ఫోన్‌ నంబర్‌ను అడ‌గ‌డం వీడియోలో చూడొచ్చు. మొద‌ట‌ నీరజ్‌ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆ లేడీ ఫ్యాన్ ఆ త‌ర్వాత‌ ఫోన్ నంబర్ కూడా అడగడం ఆ వీడియోలో కనిపించింది. త‌న కోసం వేచి ఉన్న‌ అభిమానులకు నీర‌జ్‌ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

ఆ వీడియోలో పలువురు విదేశీ మ‌హిళలు నీరజ్‌లో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో ఒక అమ్మాయి మాత్రం, మీ ఫోన్ నంబర్ ఇస్తారా? అంటూ అడిగింది. కానీ ఆమె అభ్యర్థనను భారత స్టార్ జావెలిన్ త్రోయర్ సున్నితంగా తిరస్కరించి అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం ఆ వీడియోలో కనిపిస్తోంది. 

ఇక వీడియో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ అయినప్పటి నుంచి బాగా వైర‌ల్ అవుతోంది. అర మిలియన్‌కు పైగా వ్యూస్‌, వందల సంఖ్య‌లో కామెంట్స్ వ‌స్తున్నాయి.

బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్‌ లీగ్ ఫైనల్ తర్వాత తీసిన వీడియో అని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్న‌ప్పటికీ, వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో క్లారిటీ లేదు. ఇక‌ డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా కేవలం 1 సెంటీమీటర్ తేడాతో మరో టైటిల్‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే.
Advertisement
Neeraj Chopra
Lady Fan
Phone Number

More Telugu News