Dummy Bomb: సీఎం రేవంత్ వెళ్లే దారిలో డమ్మీ బాంబు

Dummy bomb identified in CM Revanth Reddy convoy route
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఆయన కాన్వాయ్ ప్రయాణించే జూబ్లీహిల్స్ దారిలో ఈ నెల 15వ తేదీన నలుపు రంగు బ్యాగ్ దొరికింది. దీన్ని సీఎల్ డబ్ల్యూ అధికారులు స్వాధీనం చేసుకుని వారి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ బ్యాగును పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ ప్రాంతానికి ఆ బ్యాగు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సినిమా షూటింగుల కోసం డమ్మీ బాంబును సిద్ధం చేసినట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Dummy Bomb
Revanth Reddy
Congress

More Telugu News