Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రి అంటే అందమే కాదు .. అమాయకత్వం కూడా!

Savitri Special
Advertisement
  • మహానటి ఒక్క సావిత్రి మాత్రమే 
  • దానాలు చేయడంలో ఆమె తరువాతనే 
  • ఏనాడూ ఎవరితో తన కష్టాలు చెప్పుకోని సావిత్రి 
  • ఆమె అంటే అందరికీ అభిమానమే   

Advertisement
సావిత్రి .. కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన మహానటి. సావిత్రికి ముందు కూడా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు .. సావిత్రి తరువాత కూడా చాలామంది హీరోయిన్స్ వచ్చారు. కానీ మహానటి అనిపించుకున్నది ఒక్క సావిత్రి మాత్రమే. అప్పట్లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ చాలా బిజీ .. ఆ ఇద్దరి సినిమాలలో చేస్తూ సావిత్రి మరింత బిజీ. కథ ఏదైనా .. పాత్ర ఏదైనా సావిత్రి ఉంటే ఒక నిండుదనం .. ఒక పండుగదనం. 

అలాంటి సావిత్రి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. బయటికి తెలిసినవి కొన్ని .. తెలియనివి ఎన్నో. అప్పట్లో సావిత్రి ఒక తిరుగులేని కథానాయిక. అప్పటి స్టార్స్ చాలామంది .. ఆమెతో సీన్ అంటే ఒకటికి రెండుసార్లు రిహార్సల్స్ చేసుకునేవారట. ఎంతో ఇమేజ్ ఉన్నప్పటికీ, తన తోటి హీరోయిన్స్ తో సావిత్రి చాలా కలివిడిగా ఉండేవారట. తాను ధరించిన ఆభరణలలో ఏదైనా బాగుందని ఎవరైనా అంటే వెంటనే తీసి వాళ్లకి ఇచ్చేసేవారట. 

సావిత్రి చివరి రోజులలో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కానీ ఆ సమయంలో చాలా మందికి ఈ విషయం తెలియదట. అంటే ఎంతోమందికి ఎన్నో దానాలు చేసిన  ఆమె, ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేదన్న మాట. సావిత్రికి మొండితనం ఎక్కువనే మాట అక్కడక్కడా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆమె జీవితాన్ని పరిశీలనగా చూస్తే, అమాయకత్వమే ఎక్కువని అనిపిస్తుంది. అమాయకుల చుట్టూనే తెలివైనవాళ్లు ఎక్కువ మంది చేరతారనే మాట నిజమనిపిస్తుంది. సావిత్రి గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె పట్ల అభిమానం అణువంత కూడా తగ్గదు. అందుకు కారణం ఆమె అందం .. అభినయం మాత్రమే కాదు, స్వచ్ఛమైన అమాయకత్వం కూడా.  

Advertisement
Advertisement
Savitri
Actress
Tollywood

More Telugu News