గణేశ్ నిమజ్జనం సందర్భంగా రోడ్లపై ఆ ఒక్క పని చేయకండి: జీహెచ్ఎంసీ
- హైదరాబాద్ వ్యాప్తంగా రేపు గణేశ్ నిమజ్జనోత్సవాలు
- ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ 'ఎక్స్' వేదికగా కీలక విజ్ఞప్తి
- మిషన్లతో గాల్లోకి రోడ్లపై రంగుల కాగితాలు ఎగరేయడం చేయొద్దన్న జీహెచ్ఎంసీ
వినాయక నిమజ్జనం సందర్భంగా మిషన్లతో గాల్లోకి రోడ్లపై రంగుల కాగితాలు ఎగరేయడం చేయొద్దని కోరింది. "మిషన్లతో గాల్లో రంగుల కాగితాలు ఎగరేయటం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చు. కానీ ఆ రోడ్లను శుభ్రపరచడంలో భాగంగా ఆ చెత్తను సేకరించడానికి కొన్ని రోజుల సమయం పట్టి చాలా కష్టం అవుతుంది. అలాగే ఆ చెత్త డ్రైనేజీ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్లపై వరదకు కారణమవుతుంది. అందుకే ఇలాంటి రంగుల కాగితాలు లేదా ప్లాస్టిక్‌తో కూడుకున్న రిబ్బన్లను రోడ్లపై ఎగరేయద్దు" అని జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది.