ఈ పుస్తకాన్ని ఎవరు పంపించారో తెలియదు కానీ...!: అల్లు అర్జున్

  • అల్లు అర్జున్ కు పుస్తకాన్ని పంపించిన గుర్తు తెలియని వ్యక్తి
  • పుస్తకం టైటిల్ ను వెల్లడించిన అల్లు అర్జున్
  • ఓ పుస్తక ప్రియుడిగా ఎంతో ఆనందిస్తున్నానని వివరణ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ లేని సమయంలో ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తారు. తన పిల్లలతో ఆడుకోవడమో, లేక ఏదైనా పుస్తకం చదవడమో ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు. అయితే, అల్లు అర్జున్ బుక్ రీడింగ్ హాబీని దృష్టిలో ఉంచుకుని ఓ వ్యక్తి ఆయనకు పుస్తకాన్ని పంపించాడు. దీనిపై బన్నీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, కానీ ఒక పుస్తకాన్ని పంపించి తనను ఆశ్చర్యానికి గురిచేశాడని వివరించారు. ఆ పుస్తకం పేరు బర్న్ డ్ బినీత్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ (Burned Beneath the Fire of Desire) అని, ఆ పుస్తకాన్ని సీకే ఓబెరాన్ రచించాడని వెల్లడించారు. 

గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి పుస్తకం లభించడం ఒక పుస్తక ప్రియుడిగా ఎంతో ఆనందం కలిగించిందని అల్లు అర్జున్ తెలిపారు.


More Telugu News

Allu Arjun Book Unknown Person Icon Star Tollywood