బీఆర్ఎస్ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోంది: బీజేపీ ఎమ్మెల్యే
- ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఎమ్మెల్యే
- తెలంగాణ పౌరసరఫరాల శాఖ రూ.54 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని వ్యాఖ్య
- అవకతవకలపై గవర్నర్కు వినతిపత్రం ఇస్తామన్న పాయల్ శంకర్
ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. ఈ అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ఐదుగురు వేలందారులు టెండర్లు దక్కించుకున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.2,230 కోట్ల కుంభకోణం జరిగిందన్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.