ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వరద నష్టంపై అమిత్ షాకు శివరాజ్ సింగ్ నివేదిక
- భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం
- ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించిన శివరాజ్ సింగ్ చౌహాన్
- అమిత్ షాకు నివేదిక సమర్పించినట్లు ట్వీట్ చేసిన కేంద్రమంత్రి
ఏపీ, తెలంగాణ వరద ప్రభావానికి సంబంధించి తాను అమిత్ షాకు నివేదికను సమర్పించానని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. త్వరలో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తాయని వెల్లడించారు. ఏపీ, తెలంగాణలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందుతుందన్నారు.