గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు
- గెస్ట్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేసిన టెకీ
- టెకీలతో పాటు సినీ రంగానికి చెందిన వారు హాజరు
- పోలీసుల అదుపులో 18 మంది యువతీయువకులు
పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు.. మొత్తం 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆపై వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు.