Raj Tarun: రాజ్ తరుణ్‌ బంగారం దొంగిలించాడని ఫిర్యాదు చేసిన లావణ్య

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్‌పై లావణ్య బంగారం దొంగతనం ఆరోపణలు చేసింది. తన బంగారం, మంగళసూత్రం, దొంగిలించినట్లు ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాను బంగారం కొనుగోలు చేసిన జ్యువెల్లరీ షాప్ బిల్లులతో వచ్చింది.

తన బంగారు నగలను బీరువాలో దాచానని, వాటి తాళం చెవి రాజ్ తరుణ్ వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండానే బీరువాలోని బంగారం దొంగిలించాడని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సమర్పిస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ రూ.12 లక్షల వరకు ఉంటుందని తెలిపింది.

రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య గతంలోనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాల్వీమల్హోత్రాతో ఉంటున్నాడని పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇది కొనసాగుతుండగానే, తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య దొంగతనం ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Raj Tarun
Lavanya
Hyderabad
Police

More Telugu News