వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్‌లో చేరినా బీజేపీ గెలుపును ఆపలేరు: షానవాజ్ హుస్సేన్

  • ఇప్పటి వరకు వారు రెజ్లర్లు... ఇప్పుడు కాంగ్రెస్ కోసం కొట్లాడతారన్న షానవాజ్
  • వారి నిరసన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న వాదనకు బలం చేకూరిందని వ్యాఖ్య
  • రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటన గురించి ఏం చెబుతారో చూద్దామన్న బీజేపీ నేత
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తమ అవకాశాలను దెబ్బతీయలేరని బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. గత ఏడాది ఈ ఇద్దరు రెజ్లర్లు నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీనిపై షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, రెజ్లర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. వారు రెజ్లర్లే కావొచ్చని... కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోసమే కొట్లాడతారన్నారు. రెజ్లర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో, నాటి నిరసన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న వాదనలకు బలం చేకూరిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్ము కశ్మీర్‌లో అభివృద్ధి మాటను పక్కన పెట్టి ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై కూడా షానవాజ్ స్పందించారు. తన పర్యటన గురించి ఏం చెబుతారో వేచిచూద్దామన్నారు.

Vinesh Phogat
Sports News
Congress
BJP

More Telugu News