క్షేమంగా దిగిన బోయింగ్ స్టార్ లైనర్.. వ్యోమగాములను అక్కడే వదిలేసి వచ్చిన స్పేస్ షిప్
- న్యూమెక్సికోలో సేఫ్ గా ల్యాండైందని నాసా వెల్లడి
- సునీతా విలియమ్స్ ను ఐఎస్ఎస్ కు చేర్చిన స్పేస్ క్రాఫ్ట్
- తిరిగి తీసుకురాలేక ఖాళీగా తిరిగి వచ్చిన వైనం
ఆది నుంచి అన్నీ ఆటంకాలే..
బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి ఆది నుంచి అన్నీ ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రయోగానికి అన్నీ సిద్ధం చేశాక చివరి క్షణంలో పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకుని అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. వారం రోజుల తర్వాత తిరిగి బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో వ్యోమగాములను ఆ స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి తీసుకురావడం క్షేమం కాదని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరో స్పేస్ క్రాఫ్ట్ లో వారిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి, బోయింగ్ స్టార్ లైనర్ ను ఖాళీగా రప్పించారు. తాజాగా ఈ స్పేస్ షిప్ భూమికి చేరుకుంది. వ్యోమగాములు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగిరానున్నారు.