తమిళ సినీ పరిశ్రమలోనూ లైంగిక వేధింపులు... నటి సౌమ్య సంచలన ఆరోపణలు
- తమిళ సినీ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన నటి సౌమ్య
- కూతురని పిలుస్తూనే నీచంగా ప్రవర్తించాడన్న సౌమ్య
- మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్‌కు వివరాలు వెల్లడిస్తానని సౌమ్య వెల్లడి
18 ఏళ్ల వయసులోనే తెలిసిన వారి ద్వారా తనకు సినిమాలో అవకాశం వచ్చిందని, దర్శకుడు నచ్చజెప్పడంతో తన ఇంట్లో వారు సుముఖత వ్యక్తం చేశారన్నారు. మొదటి మీటింగ్‌లోనే ఆ దర్శకుడి ప్రవర్తన తనకు నచ్చలేదని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని, ఆయన భార్య ఇంట్లో లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని పేర్కొంది. అతను తననొక సెక్స్ బానిసగా చేశాడని, తన బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ దర్శకుడు ఎవరు అనేది పేరు చెప్పడానికి అంగీకరించని నటి సౌమ్య .. మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి వేధింపుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం (సిట్) కు మాత్రమే తాను వివరాలు వెల్లడిస్తానని చెప్పింది.