శాంతి-యుద్ధంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో బలగాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రమంత్రి
- శాంతిని కాపాడాలంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సూచన
- లక్నోలో జరిగిన త్రివిధ దళాల జాయింట్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ... భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకోవడంతో పాటు ఊహించని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. భారత్ ప్రపంచ శాంతిని కోరుకునే దేశమని వ్యాఖ్యానించారు.
దీనిని కాపాడుకోవడానికి సాయుధ బలగాలు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. శాంతి, స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు, పొరుగు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాల్ విసురుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని సైన్యాధికారులు విస్తృత, లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.