విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి షాకిచ్చిన జీవీఎంసీ అధికారులు
- భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్దంగా నేహారెడ్డి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు
- జనసేన నేత మూర్తి యాదవ్, కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో చర్యలు చేపట్టిన అధికారులు
- సాయంత్రం వరకూ కొనసాగనున్న ఆక్రమ నిర్మాణాల తొలగింపు
ఇక్కడి అక్రమ నిర్మాణాలపై జనసేన నేత మూర్తి యాదవ్, మరి కొందరు కూటమి నేతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేహారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ జడ్జి ధర్మాసనం ..ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. మరోపక్క అక్రమ నిర్మాణాలను తొలగించడం లేదంటూ ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ను పిటిషనర్లు ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో కోర్టు స్టే లేనప్పుడు అధికారులు అక్రమ నిర్మాణాలను నిబంధనల ప్రకారం తొలగించవద్దని హైకోర్టు తెలిపింది. దీంతో అధికారులు ఈరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.