నడవలేని స్థితిలో నటుడు 'ఫిష్' వెంకట్!
- నటుడిగా 'ఫిష్' వెంకట్ కి పేరు
- 100కి పైగా సినిమాలు చేసిన నటుడు
- రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని వెల్లడి
- అందుకే సినిమాలు చేయడం లేదని కన్నీళ్లు
ఏడాదిన్నర కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం వల్లనే ఆయన సినిమాలకి దూరమయ్యాడనే విషయం 'సుమన్ టీవీ' ద్వారా బయటికి వచ్చింది. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన పరిస్థితి గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని రోజులుగా నడవడం కూడా కష్టమైపోతోందంటూ ఆవేదన చెందాడు.
తన రెండు కిడ్నీలు దెబ్బ తిన్నాయనీ, ఏడాదిన్నరగా డయాలసిస్ జరుగుతోందని ఆయన అన్నాడు. గతంలో కాలుకి జరిగిన ఆపరేషన్ కూడా తనపై ఎక్కువ ప్రభావం చూపించిందని చెప్పాడు. తాను ఈ పరిస్థితిని ఇంతవరకూ ఎవరికి చెప్పుకోలేదని అన్నాడు. తనకి ఇద్దరు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల ఉన్నారనీ, మగపిల్లలు డబ్బు పరంగా ఎలాంటి సాయం చేయడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు.