బ్రూనై చేరుకున్న ప్రధాని మోదీ
- బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్ లో మోదీకి ఘనస్వాగతం
- ఓ భారత ప్రధాని బ్రూనైలో ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం
- భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తి
కాగా, ఈ పర్యటనకు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఓ భారత ప్రధాని బ్రూనై దేశానికి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం వెళ్లడం ఇదే ప్రథమం. భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భం కూడా మోదీ పర్యటనకు విశిష్టతను చేకూర్చింది.