Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్... 10 మంది మావోలు మృతి

10 Maoists Killed in Encounter in Chhattisgarh
షార్ట్స్‌లో చూడండి
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ‌, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. పోలీసుల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

రెండు జిల్లాల స‌రిహ‌ద్దు ప్రాంతాలైన భైరంగాడ్‌, దంతెవాడ పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలోని అట‌వీ ప్రాంతాల్లో ఈ ఘ‌టన జ‌రిగింది. ఇక ఎన్‌కౌంట‌ర్ అనంత‌రం ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
Chhattisgarh
Encounter

More Telugu News