నిన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’.. ఇప్పుడు ‘చెడ్డీగ్యాంగ్’.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు
- మహారాష్ట్రలో వాలిన చెడ్డీగ్యాంగ్
- నాసిక్‌లోని మాలెగావ్‌లో రూ. 5 లక్షల విలువైన బంగారం చోరీ
- గతవారం మాలెగావ్ వాసులను భయపెట్టిన ‘గౌన్‌గ్యాంగ్’
మాలెగావ్‌లో నిన్నమొన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’ హల్‌చల్ చేయగా, ఇప్పుడు చెడ్డీగ్యాంగ్ రంగంలోకి దిగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌన్‌గ్యాంగ్ సభ్యులు మహిళల గౌన్లు ధరించి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. పదునైన ఆయుధాలు ధరించిన ఈ గ్యాంగ్ గతవారం పలు ఇళ్లను దోచుకుంది. ఓ ఆలయంలోని డొనేషన్ బాక్స్‌లోని డబ్బును కూడా ఎత్తుకెళ్లింది.