క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 వెర్షన్ విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
- నేటి నుంచి కొత్త మోడల్ బైక్ బుకింగ్ .. టెస్ట్రైడ్ లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన కంపెనీ
- ఏడు కొత్త రంగులతో నూతన క్లాసిక్ 350 ఎన్ఫీల్డ్ బైక్
- సెప్టెంబర్ 4వరకు బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెన్నై సందర్శనకు అవకాశం
రీ మోడల్ చేసిన ఈ బైక్‌లో ఇప్పటికే ఉన్న మెకానికల్ భాగాలను కొనసాగిస్తూనే కొత్త కలర్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఎక్స్ ట్రా పార్ట్స్‌ను యాడ్ చేసింది. బైక్ బుకింగ్, టెస్ట్రైడ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ప్రత్యేకతలు ఇవే..
రాయల్ ఎన్ఫీల్డ్ ఐదు వేరియంట్లలో ఏడు కొత్త కలర్ స్కీమ్‌లను ప్రకటించింది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్, ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ పొజిషన్ ఇండికేటర్.. టైప్ సీ యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. నేటి నుంచి 4 వరకూ కొత్త క్లాసిక్ 350 బుక్ చేసుకునే వినియోగదారులు రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ సౌకర్యాలను సందర్శించడానికి చెన్నైకి వెళ్లే అవకాశాన్ని కూడా పొందుతారని కంపెనీ ప్రకటించింది.