జగన్ ఓడిపోలేదు.. ప్రజలు ఓడిపోయారు: రోజా
- ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదన్న రోజా
- ఇంత ఘోరంగా ఓడిపోయే తప్పులు వైసీపీ నాయకత్వం చేయలేదని వ్యాఖ్య
- ఏం జరిగిందనేది ఏదో ఒకరోజు బయటకు వస్తుందన్న రోజా
కోవిడ్ టైమ్ లో కూడా నగరి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో పాటుపడ్డానని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే కుటుంబ పెద్ద అని... ఒక కుటుంబ పెద్దగా కుల, మత, పార్టీలకు అతీతంగా అందరి మనిషిలా తాను పని చేశానని తెలిపారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అంకాలమ్మ గుడి వద్ద నూతనంగా నిర్మించిన బలిజ భవనాన్ని రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.