‘ఎక్స్’ పై నిషేధం విధించి మస్క్ కు షాకిచ్చిన బ్రెజిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఎక్స్’ పై నిషేధం విధించి మస్క్ కు షాకిచ్చిన బ్రెజిల్

Brazil Supreme Court Banned X In Country
  • తమ దేశంలో ఎక్స్ తరఫున ఓ ప్రతినిధిని నియమించాలన్న బ్రెజిల్ సుప్రీంకోర్టు
  • తమ తరఫున ప్రతినిధి ఉండాల్సిన అవసరం లేదన్న కంపెనీ
  • మరో ఏడు దేశాల్లోనూ ఎక్స్ పై బ్యాన్
అమెరికా వ్యాపారవేత్త, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ కు బ్రెజిల్ సుప్రీంకోర్టు షాకిచ్చింది. బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో ఓ ప్రతినిధిని నియమించేందుకు మస్క్ నిరాకరించడంతో ఈ ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. నిషేధపు ఉత్తర్వులను అతిక్రమించి వీపీఎన్ ద్వారా ఎక్స్ ను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని కోర్టు పదే పదే హెచ్చరించింది.

దాదాపు 40 మిలియన్ల జనాభా ఉన్న బ్రెజిల్ లో 80 లక్షల మంది ఎక్స్ ను ఉపయోగిస్తున్నారు. నెలకు ఒకసారైనా ఎక్స్ లో పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం చేస్తుంటారని ఓ సర్వే వెల్లడించింది. బ్రెజిల్ లో ఎక్స్ ఎంటరైన తర్వాత నుంచి ఇప్పటి వరకూ కంపెనీ తరఫున ప్రతినిధిని నియమించలేదు. స్థానికంగా ఏర్పడే న్యాయవివాదాలను పరిష్కరించుకోవడానికి లీగల్ రిప్రజెంటేటివ్ ను నియమించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఎక్స్ కు సూచించింది. అయితే, ఈ సూచనను మస్క్ కంపెనీ పెడచెవిన పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఎక్స్ సేవలను దేశంలో నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఎక్స్ పై బ్యాన్ విధించిన దేశాలు..
చైనా, ఇరాన్, తుర్కెమిస్థాన్, నార్త్ కొరియా, ఉజ్బెకిస్థాన్, రష్యా, మయన్మార్
Advertisement
X Corp
Twitter
Brazil
Banned

More Telugu News