ఇకపై ఏపీ ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులోకి
- ఆగస్టు 29 నుండి జీవోఐఆర్ వెబ్ సైట్ పునరుద్ధరణ
- ప్రభుత్వ శాఖలు అన్ని ఉత్తర్వులను జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశాలు
- గత వైసీపీ హయాంలో జీవోఐఆర్ వెబ్ పోర్టల్ నిలుపుదల
2021 ఆగస్టు 15 నుండి గత వైసీపీ ప్రభుత్వం జీవోఐఆర్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ ను నిలుపుదల చేయడంపై నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో ని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో 2021 నుండి నిలిచిపోయిన జీవోఐఆర్ వెబ్ పోర్టల్ ను పునరుద్దరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.