రేవంత్ రెడ్డి దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డి దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy alerts CM Revanth Reddy
  • పాతబస్తీలోనూ చెరువులు కబ్జాకు గురయ్యాయన్న బీజేపీ నేత
  • ఒవైసీ కాలేజీని కూల్చే దమ్ముందా? అని సవాల్
  • ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాకు హైప్ తెచ్చారని ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న దూకుడుతనమే ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశముందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పాతబస్తీలోనూ చెరువులు కబ్జాకు గురయ్యాయని, వాటిని తొలగించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. చెరువును కబ్జా చేసి ఒవైసీ కాలేజీని నిర్మించారని, ఆ కాలేజీని కూల్చేస్తారా? అని సవాల్ విసిరారు.

మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ సఖ్యతతో ఉంటోందని, అలాంటప్పుడు ఒవైసీ కాలేజీని ఎలా కూలగొడతారన్నారు. ఇతర అంశాలను పక్కదారి పట్టించేందుకే హైడ్రాకు అంతగా హైప్ తీసుకువచ్చారని ఆరోపించారు. కూల్చివేతల గురించి జనం చర్చించుకుంటే ఇతర అంశాల గురించి మాట్లాడుకోరని వారు భావిస్తున్నారన్నారు.

అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఏలేటి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతమందికి రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమందికి కావాల్సి ఉంది? చెప్పాలన్నారు. రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం చెబుతున్నారని, కానీ మంత్రులేమో రూ.17 వేల కోట్లు మాత్రమే అయ్యాయని అంటున్నారని విమర్శించారు. ఇందులో ఎవరి మాటను నమ్మాలని అడిగారు.
Advertisement
Alleti Maheshwar Reddy
BJP
Telangana
Revanth Reddy

More Telugu News