మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి... మంత్రి గొట్టిపాటి స్పందన
- డేవిడ్ రాజు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్న గొట్టిపాటి
- జడ్పీ చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని వెల్లడి
- డేవిడ్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైనం
పాలపర్తి డేవిడ్ రాజు 1999లో టీడీపీ తరఫున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ పార్టీ ఏర్పడ్డాక ఆ పార్టీలో చేరారు. తిరిగి 2017లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో డేవిడ్ రాజు మళ్లీ వైసీపీలో చేరారు. వైసీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన పలుమార్లు చంద్రబాబును కలిసినప్పటికీ మళ్లీ టీడీపీలోకి రాలేకపోయారు.