రాజధాని అమరావతి ప్రాంతంలో 4 మెగా పార్క్‌లు : మంత్రి నారాయణ
- రాజధాని ఏరియాలో 500 ఎకరాల్లో వాటర్ లేక్స్
- ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు ఏర్పాటుకు చర్యలు
- శాఖమూరు సెంట్రల్ పార్క్ లో బోటింగ్‌కు అనువుగా 50 ఎకరాల్లో రిజర్వాయర్
శాఖమూరు, అనంతవరం, నీరుకొండ ప్రాంతాల్లో సుందరమైన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో బోటింగ్‌కు అనువుగా 50 ఎకరాల్లో రిజర్వాయర్‌ను నిర్మించి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీరుకొండలో 500 ఎకరాల్లో వాటర్ లేక్స్ ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్కులను ఏర్పాటు చేసి వీటిలో విభిన్న రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నామని మంత్రి నారాయణ వివరించారు.