కూటమి అభ్యర్థి లేకపోవడం వల్లే బొత్స గెలిచారు: విష్ణుకుమార్ రాజు
- ఐదేళ్లలో జగన్ అన్నింటినీ దోచుకున్నారన్న విష్ణుకుమార్ రాజు
- రుషికొండపై విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని విమర్శ
- ఫార్మా కంపెనీ ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపాటు
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై కూటమి ప్రభుత్వం స్పందించలేదని జగన్ అనడం దారుణమని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం సంభవించిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని... బాధితులు సైతం ఆశ్చర్యపోయేలా ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించి, వెంటనే నష్టపరిహారాన్ని అందజేశారని చెప్పారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.