విజయవాడలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు

Vijayawada TDP corporators joined TDP
  • టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు
  • టీడీపీలో చేరేందుకు చాలా మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారన్న కేశినేని చిన్ని
  • విజయవాడను టీడీపీకి కంచుకోటగా మారుస్తామని వ్యాఖ్య
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా సమక్షంలో వీరు వైసీపీ కండువా కప్పుకున్నారు. పలు చోట్ల వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో... పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. తాజాగా విజయవాడలో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ... విజయవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు ముందుకొచ్చినా వారికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధిని ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తామని చెప్పారు. విజయవాడను టీడీపీకి కంచుకోటగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కారణంగా విజయవాడలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి పనులకు జగన్ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చెప్పారు. బొండా ఉమా మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో విజయవాడలో వైసీపీ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని అన్నారు.
Go Back to Shorts
YSRCP
Corporators
Telugudesam
Vijayawada

More Telugu News